A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » మీలో ఎవరు కోటీశ్వరుడు: నాగ్ టీవీ షోలో సమంత కూడా

మీలో ఎవరు కోటీశ్వరుడు: నాగ్ టీవీ షోలో సమంత కూడా

{[['']]}అక్కినేని నాగార్జున బుల్లితెరపైకి అరంగేట్రం చేస్తూ చేసిన రియాలిటీ షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు'. ఈ షో హిందీలో బాగా ఫేమస్ అయిన కౌన్ బనేగా కరోడ్పతి షోకి రీమేక్ వెర్షన్. ఈ మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం ద్వారా నాగార్జున తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర కావడమే కాకుండా టిఆర్పి రేటింగ్స్ లో రికార్డ్ రేటింగ్స్ సాధించింది.

ఈ మీలో ఎవరు కోటీశ్వరుడు ఫస్ట్ సీజన్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం ఈ షో టీం మీలో ఎవరు కోటీశ్వరుడు సెకండ్ సీజన్ ఈ రోజు( డిసెంబర్‌ 8) నుంచి ప్రారంభం కాబోతోంది. రాత్రి 9.30 గంటలకు మాటీవీలో ఈ షో ప్రసారం కానుంది. మొదటి సీజన్‌కు ఏమాత్రం తగ్గకుండా ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు వారానికి ఐదు రోజుల పాటు ఈ షో అలరించనుంది.

ఈ రెండో సీజన్లో పలువురు సినీ సెలబ్రిటీలు మీలో ఎవరు కోటీశ్వరు షోలో స్పెషల్ గెస్టులగా దర్శనం ఇవ్వనున్నారు. ఇప్పటికే నితి, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వారిపై ఈ షోకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసారు. తాజాగా సమంత కూడా ఈ లిస్టులో చేరారు. ఇటీవలే ఆమె ఇందుకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసారు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved