A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 350 మంది అమ్మాయిలకు ముద్దు...

ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 350 మంది అమ్మాయిలకు ముద్దు...

{[['']]}ఒకరు కాదు, ఇద్దరు కాదు... ఏకంగా 350 మంది అమ్మాయిలకు ముద్దు పెట్టానని సుమలత భర్త, కర్ణాటక మంత్రి, సినీ నటుడు అంబరీష్ అంటున్నారు. గతంలో ఓ అమ్మాయిని అంబరీష్‌ ముద్దుపెట్టిన ఫొటోపై ప్రతిపక్షాల ఆందోళన నేపధ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల ఓ బార్‌లో మందుకొట్టి, హిందీ సాంగ్‌కు డ్యాన్స్‌ చేస్తూ అంబరీష్ కెమెరాకు చిక్కిన సంగతి తెలిసిందే. ఇది తన వ్యక్తిగతమని ఆయన వాదిస్తున్నారు.

అయితే, ఇలా మందుకొట్టి మజా చేసే మంత్రి రూ.1.22 కోట్ల ప్రభుత్వ నిధులు ఖర్చు చేసి సింగపూర్‌లో వైద్యం చేయించుకోవడంలో ఆంతర్యమేమిటని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి.

కాగా అంబరీష్ తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ సూచన మేరకు సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ఈ మొత్తాన్ని కర్ణాటక ప్రభుత్వం ఖర్చు పెట్టిన సంగతి తెలిసిందే. 

Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved