A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » 'పవన్ కళ్యాణ్ హటావో -పాలిటిక్స్ బచావో' సీరియల్ పుస్తకాలు తెస్తా... పవన్ పై కసి...

'పవన్ కళ్యాణ్ హటావో -పాలిటిక్స్ బచావో' సీరియల్ పుస్తకాలు తెస్తా... పవన్ పై కసి...

{[['']]}పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఉన్నంత వరకు తన పోరాటం ఆగదని, 'పవన్ కళ్యాణ్ హటావో -పాలిటిక్స్ బచావో' పుస్తకానికి సంబంధించి సీరియల్ మాదిరి పార్టులు ప్రచురిస్తూ ఉంటామని ఆ పుస్తక రచయిత బొగ్గుల శ్రీనివాస్ తెలియజేయడం ఇపుడు టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది.  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై సంధించిన విమర్శనాస్త్రం 'పవన్ కళ్యాణ్ హటావో -పాలిటిక్స్ బచావో' పుస్తకాన్ని బొగ్గుల శ్రీనివాస్ తన పుస్తకాన్ని 17 నుంచి 26వ తేది వరకు ఎన్టీఆర్ స్టేడియంలో ప్రదర్శనకు ఉంచారు.

'పవన్ కళ్యాణ్ హఠావో - పాలిటిక్స్ బచావో' బుధవారం నుంచి జనవరి 26 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో పెట్టేశారు. ఐతే ఈ పుస్తకం పెట్టిన దగ్గర్నుంచి పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయనీ, అందువల్ల తనకు రక్షణ కల్పించాలని ఆయన హోమ్ మంత్రి నాయిని నరసింహారెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.

దీనిపై హోం మంత్రి స్పందించారు. పుస్తక ప్రదర్శనకు పూర్తి బందోబస్తుతో పాటు రక్షణ కల్పిస్తామని ఆయన శ్రీనివాస్‌కు హామీ ఇచ్చారు. పోలీసు అధికారులకు ఈ మేరకు ఆదేశాలు కూడా ఇచ్చారు. దానికి ఈయన ధన్యవదాలు తెలిపారు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved