A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » ‘రజనీకాంత్ కంటే దర్శకుడు శంకర్ గొప్పోడు’

‘రజనీకాంత్ కంటే దర్శకుడు శంకర్ గొప్పోడు’

{[['']]}


ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ....తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఇటీవల విడుదలైన ‘ఐ' ట్రైలర్ చూసిన తర్వాత తనదైన రీతిలో ట్విట్టర్లో కామెంట్ల వర్షం కురిపించాడు. ఈ సంక్రాంతి పండగ శంకర్ రాత్రి అవుతుందంటూ కామెంట్స్ చేసారు.

‘ఐ' ట్రైల్ చూసిన తర్వాత ఒక సాధారణ వ్యక్తిగా ఆలోచిస్తే....తమిళనాడులో రజనీకాంత్, జయలలిత కంటే శంకర్ చాలా గొప్పోడిగా కనిపిస్తున్నాడు అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు నేను రజనీకాంత్ అభిమానిగా ఉన్నాను. కానీ ఇపుడు శంకర్ అభిమానికిగా మారుతున్నాను అంటూ వ్యాఖ్యానించారు.

‘ఐ' చిత్రం ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో రజనీకాంత్ ‘లింగా'ను మించి పోతుంది. అందుకే నేను రజనీకాంత్ కంటే శంకర్ గొప్పోడు అంటున్నాను. శంకర్ లాంటి వ్యక్తి అమీర్ ఖాన్ లాంటి హీరోతో సినిమా తీస్తే అది ఇండియన్ ‘అవతార్' అవుతుంది. ఇండియాలో హాలీవుడ్ లెవల్లో సినిమా తీసింది శంకర్ ఒక్కడే అంటూ రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved