A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » వ్యభిచారం కేసు: శ్వేతా బసుకు కోర్టు క్లీన్ చిట్

వ్యభిచారం కేసు: శ్వేతా బసుకు కోర్టు క్లీన్ చిట్

{[['']]}సినీనటి శ్వేతాబసు ప్రసాద్ కు ఊరట లభించింది.  నాంపల్లి కోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. శ్వేతాబసు ప్రసాద్ పై అభియోగాలను కోర్టు కొట్టేసింది. ఎర్రమంజిల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆమె నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని శ్వేతాబసు ప్రసాద్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.

కావాలనే పోలీసులు తనను ఇరికించారని ఆమె కోర్టు ముందు వాదనలు వినిపించారు. ఓ ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆ హోటల్ కు వెళ్లినట్లు శ్వేతాబసు ప్రసాద్ న్యాయస్థానం ముందు విన్నవించారు. దాంతో ఆమె వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు, కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

కాగా  కోర్టు తీర్పుపై శ్వేతాబసు ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు కోసమే ఇన్నిరోజులుగా వేచి చూస్తున్నానని..ఆమె తెలిపారు. చాలా రోజుల తర్వాత తన కుటుంబ సభ్యుల మొహాల్లో నవ్వు కనిపిస్తుందని పేర్కొన్నారు. 

Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved