A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » ఎఫైర్: ఆమె కూతురు లాంటిది, తప్పుగా ఆలోచించొద్దు!

ఎఫైర్: ఆమె కూతురు లాంటిది, తప్పుగా ఆలోచించొద్దు!

{[['']]}


కన్నడ సినీ నటుడు అంబరీష్ ఓ అమ్మాయిని ముద్దాడుతున్న ఫోటో ఒకటి కన్నడ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ వార్తలను అంబరీష్ భార్య, సినీ నటి సుమలత ఖండించారు. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి గురించిన పూర్తి వివరాలు ఆమె బయట పెట్టారు.

ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు వైభవి అని, తమ ఫ్యామిలీ ఫ్రెండ్, యాక్టర్ జైజగదీష్-విజయలక్ష్మి దంపతుల కూతురని తెలిపారు. వైభవిని అంబరీష్ సొంత కూతురులా చూసుకుంటారు. కొన్ని నెలల క్రితం తామంతా తమ నివాసంలో కలిసామని, ఆ సమయంలో తీసిన ఫోటోయే అది అని ఆమె తెలిపారు. ఆ ఫోటో తమ ఇంట్లోదే అనడానికి బ్యాగ్రౌండ్లో తమ ఫోటో కూడా ఉందని ఆమె స్పష్టం చేసారు. రాజకీయ లబ్ది కోసం ఈ ఫోటోతో అనవసర రాద్దాంతం చేయొద్దని సుమలత స్పష్టం చేసారు.

ఈ వార్తలతో వైభవి చాలా అప్ సెట్ అయిందని, వ్యక్తిగత వ్యవహారాలను ఇలా రచ్చకీడ్చడం సరికాదని సుమలత అన్నారు. వైభవి చిన్నతనం నుండి తమ చేతుల మీదుగా పెరిగిందని, ఆమె తమ కూతురు లాంటిదని సుమలత నొక్కి చెప్పారు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved