A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » సునీల్ ఏంటి ఇలా ఉన్నాడు..? (ఫొటో)

సునీల్ ఏంటి ఇలా ఉన్నాడు..? (ఫొటో)

{[['']]}


మిస్టర్ పెళ్లి కొడుకు, భీమవరం బుల్లోడు చిత్రాల పరాజయం తర్వాత సునీల్ మరో చిత్రం ఒప్పుకున్నట్లు ఎక్కడా కనపడలేదు. అప్పుడప్పుడూ ఆ దర్శకుడుతో, ఈ నిర్మాతతో...ఫలానా బ్యానర్ లో అని వార్తలు వచ్చినా అవేమీ ముందుకు వెళ్లినట్లు కనపడలేదు. కష్టపడి సిక్స్ ప్యాక్ చేసిన తర్వాత సునీల్ కు సరైన స్క్రిప్టు ఒక్కటీ కనపడలేదు. అందాలు రాముడు, మర్యాద రామన్న రేంజి హిట్ ఒక్కటి అతని కెరీర్ లో రాలేదు. పూలరంగడు బాగా ఆడినా అతనికి పెద్ద ప్లస్ కాలేకపోయింది. రీసెంట్ గా ఈ లుక్ లో సునీల్ కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇవన్నీ ప్రక్కన పెడితే సునీల్ ప్రస్తుతం రెండు సినిమాల్లో బిజీగా ఉన్నాడు. వాటికి సంభంధించిన లుక్ ఇది అంటున్నారు.

అది తను చేస్తున్న చిత్రాల్లో క్యారక్టర్ కు సంభందించన లుక్కా లేక...క్యాజువల్ లుక్కా అనేది తెలియదు. తొలిసారిగా ఇలా రఫ్ లుక్ తో గడ్డంతో సునీల్ కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమార్తె వివాహంలో ఇలా కనిపించాడు. ఈ లుక్ దేనికి సంభందించింది అనేది తెలియాలంటే ఏదో ఒక సినిమా ఫస్ట్ లుక్ రావాల్సిందే.

ఇక సునీల్ హీరోగా ‘జోష్' ఫేం వాసు వర్మ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఓ చిత్రం ఆ మధ్యన ప్రారంభమైంది. దిల్ రాజు మాట్లాడుతూ... వాసు వర్మ చాలా టాలెంటెడ్ డైరెక్టర్. జోష్ సినిమాతో వాసు వర్మను దర్శకుడిగా పరిచయం చేశాం. ఆ సినిమా మేం ఆశించిన విజయం సాదించలేదు. ఈ సినిమా అతని టాలెంట్ ప్రూవ్ చేసుకునే సినిమా అవుతుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్. విలువలతో కూడిన వినోదాత్మక సినిమా. కోన చక్కని కథను రెడీ చేశారు. ఫిబ్రవరిలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved