A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » మీడియాకు శ్వేతాబసు 'ఓపెన్ లెటర్': అందులో ఏముంది?

మీడియాకు శ్వేతాబసు 'ఓపెన్ లెటర్': అందులో ఏముంది?

{[['']]}వ్యభిచార సంబంధ కేసులోకి మీడియా తనను తప్పుగా లాగిందంటూ సినీనటి శ్వేతాబసుప్రసాద్‌ ఓ బహిరంగ లేఖలో ఆరోపించారు. మీడియాకు సంబంధించిన ఉదంతాలు తనను విషాదానికి గురిచేశాయన్నారు. జరిగినదంతా మరచిపోయి జీవితంలో ముందుకు సాగాలని భావిస్తున్నానన్నారు. ఈ మేరకు ఆమె ఓపెన్ లెటర్ రాసారు. ఇటీవల ఓ వ్యభిచార సంబంధ రాకెట్‌ వెలుగులోకి రాగా.. ఆ కేసులో ప్రమేయం ఉందనే ఆరోపణలతో ఆమెను పునరావాస సదనానికి తరలించిన సంగతి తెలిసిందే.

సదరు కేసులో ఈనెల 5న నాంపల్లి మెట్రోపాలిటన్‌ న్యాయస్థానం ఆమెను నిర్దోషిగా ప్రకటించి, అభియోగాల్ని ఉపసంహరించి, విచారణ కోర్టు ఆదేశాలను నిలుపుదల చేసిన విషయం విదితమే. ఈ మేరకు ఆమె తాజాగా ట్విటర్‌ఖాతాలో బహిరంగ లేఖను పోస్టు చేశారు. సంఘటనకు సంబంధించి తప్పుదోవ పట్టించే కథనాలు వెలువడ్డాయన్నారు. తప్పుడు ప్రకటనలు చేసిన వారినీ, వాస్తవాలను నిర్ధరించుకోకుండా తప్పుదోవ పట్టించే కథనాలను ప్రోత్సహించిన వారినీ వదిలేస్తున్నానన్నారు. ఈ ఉదంతానికి ఇంతకన్నా ఎక్కువ ప్రాధాన్యం అవసరం లేనందునే జరిగినదాన్నంతా వదిలేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు.

ఆ లేఖలో ఆమె ఏమన్నారంటే..

''గొప్ప పాత్రికేయులను ఆరాధిస్తూ నేను పెరిగాను. అదే మీడియా నా జీవితంలో గందరగోళాన్ని సృష్టించింది. నా వద్ద డబ్బులు లేవనీ, కుటుంబాన్ని పోషించాలనీ, వేరేమార్గం లేక ఇలాంటి మార్గం ఎంచుకున్నాననీ.. ఇదంతా నేనే చెప్పినట్లుగా కథనాలు వెలువడ్డాయి. అదృష్టవశాత్తూ.. నా కుటుంబం, స్నేహితులు, సన్నిహితులు నమ్మలేదు. ఆఖరుసారిగా చెబుతున్నా.. అది నా ప్రకటన కాదు. పునరావాస సదనంలో పత్రికలు, టీవీలు, ఇంటర్‌నెట్‌, రేడియో ఇవేవీ అందుబాటులో లేకుండా పోయాయి. ముంబయిలోని ఇంటికి చేరాక అప్పటి వరకూ వచ్చిన కథనాలను చూసి అసంతృప్తికి లోనయ్యాను.

ఆగస్టు 30న ఓ అవార్డుల కార్యక్రమం కోసం హైదరాబాద్‌లో ఉన్నాను. కార్యక్రమ నిర్వాహకులే నాకు టికెట్లు, వసతి ఏర్పాటు చేశారు. నా ప్రయాణ సంబంధ వివరాలన్నీ నా ఈమెయిల్‌ బాక్సులో ఉన్నాయి. సెక్సు వ్యాపారం కోసం నన్నెవరూ ప్రోత్సహించలేదు. నా తల్లిదండ్రులు నాక్కావలసినవన్నీ సమకూర్చారు. మూడున్నరేళ్లుగా భారతీయ శాస్త్రీయ సంగీతంపై 'రూట్స్‌' పేరిట డాక్యుమెంటరీ తీయడంలో తీరికలేకుండా ఉన్నాను. 'ఐఎన్‌టీ.కేఫెనైట్‌' పేరిట ఓ లఘుచిత్రం చేశాను. అది ఎన్నో చిత్రోత్సవాల్లో ప్రదర్శితమవుతోందది. మరి తలుపులెక్కడ మూసుకుపోయాయి. ఓ నిర్ణయానికి వచ్చేముందు వాస్తవాలు తెలుసుకోండి.'' అని శ్వేతాబసు తన లేఖలో పేర్కొన్నారు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved