A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » ఎయిడ్స్ బారిన రజనీ, కమల్‌ల హీరోయిన్.. విషమ స్థితిలో నిష

ఎయిడ్స్ బారిన రజనీ, కమల్‌ల హీరోయిన్.. విషమ స్థితిలో నిష

{[['']]}


సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్‌ల సరసన హీరోయిన్‌గా నటించిన ఒకప్పటి నటి నిష ఎయిడ్స్ మహమ్మారి బారిన పడి ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. ఆమె రజనీతో 'రాఘవేంద్ర', కమల్ తో 'టిక్ టిక్ టిక్' సినిమాల్లో నటించించింది.

నిష ఎయిడ్స్ వ్యాధి బారిన పడి కడు దయనీయ స్థితిలో ఉన్నారు. తమిళనాడులోని నాగపట్టణం జిల్లా నాచూర్ గ్రామానికి చెందిన నిషా ఎయిడ్స్ రోగంతో మరణపు అంచున ఉన్న ఫోటోలు వాట్సాప్, ట్విట్టరలలో ప్రచారమయ్యాయి.

ఆమె ఫోటోలను చూసిన తమిళ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి చెందింది. ఆమె శరీరం పూర్తిగా క్షీణించిపోయి అస్థిపంజరంలా మారినట్లున్న ఫోటోలను చూసి దిగ్భ్రాంతి చెందిన ఇండస్ట్రీలో ఆమెను పట్టించుకున్నవారు లేరు. క్షీణించిపోయిన దేహంతో నాగూర్ దర్గా సమీపంలో వారం రోజులుగా ఆమె అనాథగా పడి వున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఆ దుస్థితిలో ఆమె శరీరం నిండా చీమలు, ఈగలు ముసిరి ఉన్నాయి.

ఇలా దారుణ స్థితిలో ఉన్న నటి నిషా 30 ఏళ్ల క్రితం సినిమాలో కథానాయికగా మంచి పాత్రలు వేశారు. ఐతే ప్రస్తుత స్థితిని తెలియజేస్తూ ఆమె ఫోటోలతో జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యుడు న్యాయమూర్తి మురుగేశన్ ఓ సందేశం వెళ్లింది. ఆ ఫోటోలను చూసి ఆయన చలించిపోయారు. వెంటనే ఆమెకు చికిత్సను అందించాలని నాగపట్టణం జిల్లా కలెక్టర్‌, పోలీసు సూపరింటెండెంట్ లను ఆదేశించారు. నాలుగు వారాల్లో ఆమె ఆరోగ్య పరిస్థితిపై తనకు నివేదిక అందించాలని సూచించారు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved