A l l L i v e T e l u g u C h a n n e l s
Home » , » దర్శకుడు బాలచందర్ పరిస్థితి విషమం

దర్శకుడు బాలచందర్ పరిస్థితి విషమం

{[['']]}


ప్రముఖ సినీ దర్శకుడు బాలచందర్ అస్వస్ధతకు లోనయ్యారు. ప్రస్తుతం చెన్నై ఆల్వార్ లోని కావేరీ ఆసుపత్రిలో ఐసియూలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే ఆయన శిష్యుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించినట్లు తెలుస్తోంది. బాల చందర్ త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యవంతులు కావాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.

బాలయ్య వయసు 84 సంవత్సరాలు. తమిళనాడు, తంజావూరు జిల్లాలోని నన్నిలం గ్రామం ఆయన స్వస్థలం. వస్త్రాలపై వేసే రంగురంగుల పెయింటింగులకు ఈ గ్రామం ప్రసిద్ధి. వారిది సామాన్య మధ్యతరగతి కుటుంబం. నాన్న దండపాణి కైలాసం. అమ్మ సరస్వతి. అన్నామలై విశ్వవిద్యాలయం నుంచి బీయస్సీ పూర్తి చేశాడు. తరువాత అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో ఉద్యోగిగా ఆయన జీవితం ప్రారంభమైంది. ఉద్యోగం చేస్తూనే ఖాళీ సమయాల్లో సరదాగా నాటకాలు రాస్తుండేవాడు. అలా రాసిన ఒక నాటకం ఎం.జి. రామచంద్రన్ దృష్టిలో పడటంతో ఆయన్నుంచి ఆహ్వానం వచ్చింది. ఎంజీఆర్ నటించిన దైవతాయి అనే చిత్రానికి సంభాషణలు, స్క్రీన్‌ప్లే అందించాడు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved