A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » బాధలో ఎన్టీఆర్: 10 రోజుల పాటు షూటింగ్ నిలిపివేత! ఫ్యాన్స్ అయోమయం!

బాధలో ఎన్టీఆర్: 10 రోజుల పాటు షూటింగ్ నిలిపివేత! ఫ్యాన్స్ అయోమయం!

{[['']]}


హరికృష్ణ పెద్ద కుమారుడు, సినీ నిర్మాత అయిన నందమూరి జానకిరామ్ యాక్సిండెటులో మరణించడంతో నందమూరి ఫ్యామిలీ, అభిమానులు విషాదంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెలలో జరుగాల్సిన ‘టెంపర్', ‘పటాస్' ఆడియో ఫంక్షన్లు ఇక ఉండక పోవచ్చని తెలుస్తోంది. డైరెక్టుగా ఆడియోను మార్కెట్లోకి విడుదల చేస్తారని సమాచారం. కాగా...‘టెంపర్' షూటింగ్ ఇంకాస్త మిగిలి ఉంది.

అయితే జూ ఎన్టీఆర్ సోదరుడు జానకిరామ్ మరణంతో ఆయన తీవ్రమైన బాధలో ఉన్నారు. ఆయన షూటింగులో పాల్గొనే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ‘టెంపర్' షూటింగ్ 10 రోజుల పాటు నిర్మాత నిలిపివేసినట్లు యూనిట్ సభ్యుల నుండి సమాచారం అందుతోంది.

ఆ ప్రచారం అలా ఉంటే ‘టెంపర్' మూవీ ఫేస్ బుక్ అఫీషియల్ పేజీలో రేపటి నుండి షూటింగ్ ప్రారంభం అవుతుందని అంటూ అప్ డేట్ చేసారు. దీంతో ఎన్టీఆర్ షూటింగులో పాల్గొంటాడా? లేదా? లేక ఇతర తారాగణంతో మిగిలిన షూటింగ్ జరుగుతుందా? అనే అయోమయంలో పడ్డారు ఫ్యాన్స్.

ఓ అభిమాని....‘అది టైగర్ అంటే బాధను దిగమింగుకుని మరలా అపుడే షూటింగుకు రెడీ అయ్యారు' అంటూ అభిప్రాయ పడ్డాడు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved