A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » ‘మెగా ప్రిన్స్’గా చలామణి కాబోతున్న వరుణ్ తేజ్

‘మెగా ప్రిన్స్’గా చలామణి కాబోతున్న వరుణ్ తేజ్

{[['']]}


తెలుగులు సినిమా రంగంలో చిరంజీవితో ప్రారంభమైన మెగా ఫ్యామిలీ ప్రస్తానం అంచెలంచెలుగా విస్తరిస్తూ ఇండస్ట్రీలో లీడింగ్ స్థాయికి చేరుకుంది. సాధారణ నటుడిగా వెండితెర అరంగ్రేటం చేసిన చిరంజీవి అనతి కాలంలోనే ‘సుప్రీం హీరో'గా, ఆపై టాలీవుడ్ నెం.1 ‘మెగా స్టార్'గా ఎదిగారు. ఆ తర్వాత చిరంజీవి వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఆయన ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ ‘పవర్ స్టార్'గా పరిశ్రమలో తన ఆధిపత్యం కొనసాగిస్తున్నారు.

చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ‘మెగా పవర్ స్టార్'గా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్ ‘స్టైలిష్ స్టార్'గా తనదైన ముద్ర వేసారు. ఇటీవలే ‘పిల్లా నువ్వేలేని' చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిని చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తొలి చిత్రంతోనే విజయం అందుకుని సత్తా చాటాడు.

తాజాగా నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ‘ముకుంద' చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయం కాబోతున్నాడు. ముకుందా చిత్రం ఆడియో వేడుక నిన్న సాయంత్రం శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్‌ను ‘మెగా ప్రిన్స్'గా పేర్కొన్నారు చిరంజీవి. ఇకపై వరుణ్ తేజ్ మెగా ప్రిన్స్‌గా చలామని కాబోతున్నారు. వరుణ్ తేజ్‌కు బెస్టాఫ్ లక్ చెబుతూ ఆయన తొలి చిత్రం ‘ముకుంద' పెద్ద హిట్టవ్వాలని ఆశిద్దాం.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved