A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » గోపాల గోపాల: వెంకటేష్ బర్త్ డే స్పెషల్ ఇలా (ఫోటోస్)

గోపాల గోపాల: వెంకటేష్ బర్త్ డే స్పెషల్ ఇలా (ఫోటోస్)

{[['']]}
విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో ‘గోపాల గోపాల' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో నటిస్తున్నాడు. రేపు(డిసెంబర్ 13) వెంకటేష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ చిత్రానికి సంబంధించిన అతని స్టిల్స్ విడుదల చేసారు. సంక్రాంతి సందర్భంగా సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో కేవలం మూడే పాటలు ఉన్నట్లు సమాచారం.

సాధారణంగా ఐదు నుంచి ఆరు పాటలు మన సినిమాల్లో ఉంటూంటాయి. అందులోనూ వెంకటేష్, పవన్ లాంటి వారి చిత్రాలంటే ఆడియోపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉంటాయి. అలాంటిది మరీ మూడే అనేది ఆశ్చర్యకరమైన విషయం అంటున్నారు. అయితే సినిమా ఫ్లో దెబ్బతినకుండా ఇలా ప్లాన్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved