A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » చెవి కుట్టించుకున్న మంచు విష్ణు

చెవి కుట్టించుకున్న మంచు విష్ణు

{[['']]}మంచు విష్ణు హీరోగా, నిర్మాతగా డిఫరెంట్ చిత్రాల్లో నటిస్తూ, నిర్మిస్తూ తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. 2014లో పాండవులు పాండవులు తుమ్మెద, రౌడీ, అనుక్షణం, ఎర్రబస్సు చిత్రాల్లో నటించిన ఈ డైనమిక్ హీరో ప్రతి సినిమాలోనూ డిఫరెంట్ లుక్, స్టయిల్‌తో ఆకట్టుకున్నారు.

ప్రస్తుతం దేవా కట్టా దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం తమిళంలో మంచి విజయాన్ని సాధించిన ‘అరిమ నంబి' చిత్రానికి రీమేక్‌గా రూపొందుతోంది. ఇటీవలే ఈచిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి సంబంధించి హీరో విష్ణు లుక్ చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ లుక్ కి అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. అలాగే ఈ సినిమాలో విష్ణు డిఫరెంట్ గా చెవిపోగులతో కనిపించనున్నాడు. హీరో కొత్త లుక్ లో కనబడితే బావుంటుందని భావించిన డైరెక్టర్ దేవాకట్టా తన ఆలోచనని విష్ణుకి తెలియజేయడం, సినిమాల్లో తన పాత్ర, లుక్ పరంగా భిన్నంగా కనబడాలనుకునే హీరో విష్ణ దానికి సరేననడం జరిగింది.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved