A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » వెయిట్ చెయ్యలేను: ‘గబ్బర్ సింగ్-2’ హీరోయిన్ ట్వీట్

వెయిట్ చెయ్యలేను: ‘గబ్బర్ సింగ్-2’ హీరోయిన్ ట్వీట్

{[['']]}పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ 2 లో అనీషా అంబ్రోస్‌ హీరోయిన్ గా ఎంపికయిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘గోపాల గోపాల' చిత్రంలోనూ ఈ అమ్మడు ఓ చిన్న పాత్రలో కనిపించబోతోంది. సంక్రాంతికి గోపాల గోపాల విడుదల ఉన్న నేపథ్యంలో ఆమె ట్విట్టర్లో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.

‘ఈ సంవత్సరం నాకు చాలా సంతోషమైన సంవత్సరం. ఓన్నో ఆశలు ఉన్నాయి. గోపాల గోపాల సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నాను. వెయిట్ చెయ్యలేక పోతున్నాను' అంటూ ట్వీట్ చేసింది. ఈ సినిమా విడుదలైతే ‘గబ్బర్ సింగ్-2' చిత్రం ప్రారంభం అవుతుందని అమ్మడు ఆశగా ఉంది.

'గోపాల గోపాల' చిత్రం జనవరి 9న విడుదల అవుతుందని అంతా అనుకుంటున్నాం. చిత్ర యూనిట్ కూడా గత కొన్ని రోజులుగా ఇదే విషయాన్ని చెబుతూ వస్తున్నారు. కానీ తాజాగా ఓ ట్విస్ట్ పలకరించింది. ఈచిత్రం సెన్సార్ కార్యక్రమాలు లేటవడం వల్ల జనవరి 9న కాకుండా జనవరి 11న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఆ కారణంగా ఇంకా అఫీషియల్ గా మీడియాలో ప్రకనటనలు ఇవ్వడం లేదు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved