A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » వేణు మాధవ్:నేను ఆరోగ్యంగా ఉన్నా

వేణు మాధవ్:నేను ఆరోగ్యంగా ఉన్నా

{[['']]}తెలుగు చిత్ర సీమలో వరుసగా ప్రముఖులు వివిధ అనారోగ్య కారణాలతో మరణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కమెడియన్ వేణు మాధవ్ గురించి కూడా ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. గత రెండేళ్లుగా వేణు మాధవ్ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారని, ప్రస్తుతం ఆయన కూడా జీవిత చరమాకంలో ఉన్నారని ఆ పుకార్ల సారాంశం.

 ఈ వార్తలపై వేణు మాధవ్ తొలిసారిగా స్పందించారు. తనకు ఎలాంటి అనారోగ్యం లేదని, తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. ఇలా పుకార్ల రూపంలో తనను అప్పుడే దేవుడి దగ్గరకు పంపొద్దని రిక్వెస్ట్ చేసారు. ప్రస్తుతం తాను పలు సినిమాలు చేస్తున్నట్లు కూడా వెల్లడించారు.

‘నటీనటులు షూటింగుల్లో భాగంగా వివిధ ప్రాంతాలు తిరగాల్సి ఉంటుంది. ఇలాంటపుడు వివిధ రకాల ఆహార పదార్థాలు తీసుకోవాల్సి వస్తోంది. వివిధ ప్రాంతాల్లో నీళ్లు తాగాల్సి వస్తోంది. దీని వల్ల డైజెస్టివ్ సిస్టమ్, మెటబాలిజంపై ప్రభావం పడుతుంది. నా ఆరోగ్యంపై వస్తున్న వార్తలు నమ్మొద్దు. నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. ప్రస్తుతం నాలుగు చిత్రాల్లో నటిస్తున్నాను అని వేణు మాధవ్ చెప్పుకొచ్చారు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved