A l l L i v e T e l u g u C h a n n e l s
Home » , » మంచు లక్ష్మిని టార్గెట్ చేసిన ధనరాజ్... అంత సీనుందా...?

మంచు లక్ష్మిని టార్గెట్ చేసిన ధనరాజ్... అంత సీనుందా...?

{[['']]}

మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీప్రసన్న ప్రధాన పాత్రలో ‘పిలవని పేరంటం’ అనే చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఐతే కారణాలు ఏమిటో కానీ ఆ చిత్రంలో ప్రధాన పాత్రకు ఎంపికయిన ధనరాజ్ ను  ఈ చిత్రం నుంచి తొలగించారు. ఈ పని చేసింది మంచు లక్ష్మి అనే వార్తలు ఆమధ్య వినిపించాయి.

ఈ నేపధ్యంలో ధనరాజ్ మంచు లక్ష్మిని టార్గెట్ చేస్తూ ఓ చిత్రంలో నటించబోతున్నట్లు టాలీవుడ్ న్యూస్. ‘ధనలక్ష్మి తలుపు తడితే’ అనే టైటిలుతో తీయబోయే పాత్రలో అచ్చం మంచు లక్ష్మిని పోలిన ఓ నటి నటిస్తున్నట్లు సమాచారం.

ఆమె గెటప్, బాడీ లాంగ్వేజ్ అంతా మంచు లక్ష్మిని అనుకరించేట్లు ఉంటుందనీ, ఈ చిత్రంలో ధనరాజ్ ఆ క్యారెక్టరుపై సెటైర్లు పేలుస్తాడని చెప్పుకుంటున్నారు. ఐతే ఇదే నిజమయితే ధనరాజ్ కు కష్టాలు తప్పవని చెపుతున్నారు. చూడాలి ఏం జరుగుతుందో...?


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved