A l l L i v e T e l u g u C h a n n e l s
Home » , » తమిళ ఇంజినీర్... (‘రఘువరన్‌ బీటెక్‌’ రివ్యూ)

తమిళ ఇంజినీర్... (‘రఘువరన్‌ బీటెక్‌’ రివ్యూ)

{[['']]}Rating:2.5/5
ఇంజినీరింగ్ చదివినా ఉద్యోగం రాని కుర్రాడు పరిస్ధితి ఎలా ఉంటుంది...తన ఇంట్లో తన తమ్ముడు సైతం ఎమ్ సి ఎ చదివి ఉద్యోగం సంపాదించి తన ఎదురుగా తిరుగుతూంటే ఏం చేయాలి...తను ఇష్టపడ్డ అమ్మాయి తన కన్నా ఎక్కువ సంపాదిస్తూ కారులో తిరుగుతూంటే ఎలా పడేయగలడు...ఇవన్నీ చాలా మంది నేటి కుర్రాళ్ల రెగ్యులర్ సమస్యలే. వీటిన్నటినీ గుది గుచ్చి...యూత్ ను కనెక్టు చేస్తూ తమిళ భాక్సాఫీస్ ని కొల్లగొట్టేసాడు ధనుష్. అదే సినిమాని తెలుగులోకి దించారు.

అయితే అక్కడక్కడా తమిళ వాసన కనిపించే ఈ చిత్రం మన కుర్రాళ్లకూ బాగానే కిక్ ఇస్తుందనిపిస్తోంది. ప్రస్తుత సమాజంలో లో ఉన్న కుర్రకారు ఎదుర్కొంటున్న సీరియస్ పాయింట్ ని చక్కటి ఎంటర్టైన్మెంట్ తో కలిపి వండిన స్క్రిప్టు కావటంతో అందరినీ ఆకట్టుకునే అవకాసం ఉంది. ఓ రకంగా ఈ సినిమా మన తెలుగులో ఇలాంటి కథలు ఎందుకు రావటంలేదని ప్రశ్నను వదిలినట్లుంటుంది. అయితే ధనుష్ కు ఇక్కడ సూర్య,కార్తీ తరహాలో మార్కెట్ లేకపోవటం,సెకండాఫ్ ప్రెడిక్టబుల్ గా నడవటం ఇబ్బందికర అంశాలు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు రఘువరన్(ధనష్) బిటెక్ పూర్తి చేసి గత నాలుగు సంవత్సరాలుగా చేస్తే ఇంజినీరుగానే చేయాలని ఖాలీగా ఉన్న నిరుద్యోగి. ఓ ప్రక్క ఎమ్ సి ఎ చదువుకున్న తన తమ్ముడు సెటిల్ అవుతున్నా అతను మాత్రం తన పట్టుదల విడువడు. అతనికి ఇంట్లో తండ్రి నుంచి అవమానాలు ఎదుర్కొన్నా తల్లి (శరణ్య) పూర్తి సపోర్టు ఇస్తూంటుంది.ఈ లోగా...అతని ఇంటి ప్రక్కన శాలిని(అమలా పాల్) దిగుతుంది.

ఆమెతో మొదట పరిచయం తర్వాత ప్రేమ మొదలువుతాయి. అయితే ఈ లోగా ఊహించని విధంగా అతని నిర్లక్ష్యం వల్ల తల్లి చనిపోతుంది. మరో ప్రక్క అనిత(సురభి) వల్ల అతనికి సివిల్ ఇంజినీరుగా ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగంలో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటాడు. మరో ప్రక్క కార్పోరేట్ యజమాని అరుణ్( అమితాష్) అతని ఎదుగుదలకు అడ్డం పడుతూంటాడు. అతన్ని ఎలా ఎదుర్కొన్నాడు...ఇంతకీ అనిత ఎవరు... అతని తల్లి ఎందుకు చనిపోయింది...షాలినీతో లవ్ మ్యాటర్ ఏమైంది. వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఫస్టాఫ్ ఎంటర్టైన్మెంట్ తో కొత్త సీన్స్ తో వెళ్లినా సెకండాఫ్ కు వచ్చేసరికి రొటీన్ గా మార్చేసారు. విలన్ కి, హీరో కి మధ్య జరిగే గొడవగా సినిమా తిరుగుతూంటుంది. అలాగే సినిమాల్లో హైలెట్ గా చెప్పబడ్డ...తల్లి సెంటిమెంట్ మనకు కొద్దిగా అతిగానే అనిపిస్తుంది. అయితే దర్శకుడు కెమెరా మెన్ కావటంతో ప్రతీ ఫ్రేమ్ ని తీర్చి దిద్దుకుని సినిమాని ఎక్కడా కళ్లు తిప్పనివ్వకుండా చేసాడు.

అలాగే ధనుష్, తండ్రి పాత్రధారి సముద్రఖని ల మధ్య సన్నివేశాలు సైతం చాలా బాగా డిజైన్ చేసారు. క్లైమాక్స్ మరీ ఎక్కువ బిల్డప్ ఇచ్చారనిపించినా సినిమాని జస్టిఫై చేస్తుంది. ముఖ్యంగా విలన్ని అతని ఆఫీసులోనే కొట్టే సన్నివేశం సినిమా హైలెట్ లలో ఒకటిగా చెప్పవచ్చు. ఇక తమిళంలో హిట్టైన పాటలు ఇక్కడ బాగా మైనస్ గా అనిపించాయి. అయితే బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది. స్క్రీన్ ప్లే బాగానే రాసుకున్నా...సెకండాఫ్ బాగా ప్రెడిక్టుబుల్ సీన్స్ రావటంతో కాస్త నిరాసగా అనిపిస్తుంది. మొదటనుంచి ఉన్న గ్రాఫ్ ...రాను రాను డ్రాప్ అవుతుంది.

ఎడిటర్ నుంచి కూడా అవుట్ పుట్ తీసుకున్నారు దర్శకుడు. డైలాగులు కొన్ని బాగానే ఉన్నా...కొన్ని డబ్బింగ్ కు అమ్మ మొగడులా విసిగిస్తాయి. ఫైనల్ గా ఈ చిత్రం యూత్ కు పట్టే అవకాసముందనిపిస్తోంది. అయితే ధనుష్ కు ఇక్కడ ఉన్న మార్కెట్ లిమిటేషన్స్ వల్ల ఇదో రెగ్యులర్ తమిళ మాస్ యాక్షన్ చిత్రం అని పొరబడి...దూరంగా ఉంచితే చేసేదేం లేదు. ఇది యూత్ చిత్రం అని...ప్రమోషన్ ని ఏ రేంజిలో చేస్తారు..నిర్మాత అనే దానిపై ఈ చిత్రం విజయం శాతం ఆధారపడి ఉంటుంది.src:oneindia
Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved