A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » మరోసారి వార్తల్లోకి ఈటీవీ ప్రభాకర్

మరోసారి వార్తల్లోకి ఈటీవీ ప్రభాకర్

{[['']]}


యాహూ, స్మైల్ రాజా స్మైల్ వంటి గేమ్ షోలతో ఈ మధ్య కాలంలో మరోసారి పాపులర్ అయిన ఈ టీవి ప్రభాకర్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఈ సారి పాజిటివ్ నోట్ తో ఆయన వార్తల్లో నిలిచారచు. ఆయన త్వరలో మెగా ఫోన్ పట్టుకోనున్నారని సమాచారం.

అందుకు గీతా ఆర్ట్స్ వంటి పెద్ద బ్యానర్ ముందుకు రావటం అందిరిలో ఆసక్తి రేపుతోంది. కొంత కాలం క్రితం అల్లు అరవింద్ ని కలిసిన ఈ టీవి ప్రభాకర్ ఓ కథ వినిపించాండని, అది బాగా నచ్చిన అరవింద్ గోఎ హెడ్ అన్నాడని తెలుస్తోంది. చాలా లో బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కనుందని, ఆ మాత్రం బడ్జెట్ తో సొంతంగా తీసుకోగలిగే కెపాసిటీ ఉన్నా...గీతా ఆర్ట్స్ వంటి బ్యానర్ అండకోసం అరవింద్ ని కలిసాడని అంటున్నారు. స్క్రిప్టు విన్న అరవింద్ వెంటనే కొద్దిపాటి మార్పులు స్క్రిప్టులో చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్తున్నారు.

ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్ ఆఫీస్ లోనే స్క్రిప్టు బెటర్ మెంట్స్ తో స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ నెలాఖరకు స్క్రిప్టుని లాక్ చేసి ఫైనల్ వెర్షన్ వినిపిస్తారని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే నెలలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాసం కనిపిస్తోంది. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ప్రభాకర్ అతి కొద్ది కాలంలోనే టీవీ సీరియల్స్ లో క్యారెక్టర్ రోల్స్ చేసే స్దాయికి ఎదిగారు.

ఆలాగే ఎన్నో సీరియల్స్ లీడ్ రోల్స్ చేసి బుల్లితెరపై ఎంతో పాపులర్ అయ్యాడు. ఈ టీవీ సుమన్ తో కలిసి ఎన్నో సీరియల్స్ చేసిన ప్రభాకర్ జీ తెలుగులో వచ్చిన ‘ముద్దు బిడ్డ' సీరియల్ తో డైరెక్టర్ గా మారాడు. ఇప్పుడు ఈ సినిమాని డైరెక్ట్ చెయ్యడానికి శ్రీకారం చుట్టాడు. ఈ సినిమా గురించి అఫీషియల్ గా పూర్తి వివరాలు తెలియాంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved