A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » సినీ నటుడు నరేష్‌ ఇంట్లో పేలిన గ్యాస్‌ సిలెండర్

సినీ నటుడు నరేష్‌ ఇంట్లో పేలిన గ్యాస్‌ సిలెండర్

{[['']]}


సినీ నటుడు నరేష్‌ ఇంట్లో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు ఎగసి.. ఆ కారణంగా గ్యాస్‌ సిలెండర్ పేలింది. రెండు కంప్యూటర్లు, ఒక యూపీఎస్‌ దహనమయ్యాయి. అనంతపురం జిల్లా హిందూపురంలోని నానెప్ప నగర్‌లోని ఆయన ఇంట్లో మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రాణనష్టం ఏదీ సంభవించలేదని హిందూపురం టూటౌన్‌ సీఐ మధుభూషణ్‌ తెలిపారు.

పేలుడు శబ్దంతో మొదటి ఫ్లోర్‌లో ఉన్న నరేష్‌ భార్య రమ్య, ఆమె సోదరి రమ, తల్లి మంజుల, పనిమనిషి సుశీల భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలను ఆర్పింది. కాగా, ప్రమాదం వివరాలను నరేష్‌ ఫోన్‌ ద్వారా తెలుసుకున్నారు. ఈ ప్రమాదం నుంచి నరేష్ భార్య రమ్య, అత్త, మరదలు సురక్షితంగా బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. ఇంట్లోని 5 కిలోల గ్యాస్ సిలెండర్ పేలడంతో ఈ మంటలు వ్యాపించాయని అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో నరేష్ భార్య, అత్త మేడపైన గదిలో ఉన్నారు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved