A l l L i v e T e l u g u C h a n n e l s
Home » , » 'గోపాల గోపాల' డేట్ ఖరారైంది: అడ్వాన్స్ బుకింగ్ షురూ

'గోపాల గోపాల' డేట్ ఖరారైంది: అడ్వాన్స్ బుకింగ్ షురూ

{[['']]} పవన్ కల్యాణ్, వెంకటేశ్ కలిసి నటిస్తున్న గోపాల గోపాల సినిమాకు క్లీన్ 'యు' సర్టిఫికెట్ వచ్చినట్లు తెలిసింది. శ్రేయస్ మీడియా ఈ విషయాన్ని ఫేస్ బుక్ ద్వారా వెల్లడించింది. గురువారమే సెన్సార్ బోర్డు ముందుకు వచ్చిన ఈ సినిమా... ఎలాంటి అడ్డంకులు, అభ్యంతరాలు లేకుండా యు సర్టిఫికెట్ పొందిందని శ్రేయస్ మీడియా చెప్పింది. దాంతో ఈ సినిమా శనివారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

దాంతో సినిమా విడుదలకు కూడా ఎలాంటి ఆటంకాలు లేనట్లయింది. ఇప్పుడు సంక్రాంతి బరిలో నిలవడానికి కూడా ఈ సినిమా సిద్ధం అయిపోతోంది. ఎప్పుడు విడుదల చేసేదీ మాత్రం ఇంకా చిత్ర నిర్మాతలు వెల్లడించలేదు. అయితే.. బుక్ మై షో లాంటి సైట్లు మాత్రం పదోతేదీ శనివారం నాడు సినిమా విడుదల అవుతోందని చెబుతూ, ఇప్పటికే టికెట్ల అమ్మకం కూడా మొదలుపెట్టేశాయి.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved