A l l L i v e T e l u g u C h a n n e l s
Home » , » యావరేజ్: ‘గోపాల గోపాల’ యూఎస్ఏ కలెక్షన్స్

యావరేజ్: ‘గోపాల గోపాల’ యూఎస్ఏ కలెక్షన్స్

{[['']]}


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వెంకటేష్ నటించిన ‘గోపాల గోపాల' చిత్రం కలెక్షన్స్ యూఎస్ఏలో ఆశించినంతగా లేదనే వాదన వినిపిస్తోంది. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ డిస్ట్రిబ్యూటర్లను నిరాశ పరిచినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం అక్కడ శుక్రవారం ప్రీమియర్ షోలతో మొదలైంది. మొత్తం 101 లొకేషన్లలో సినిమా విడుదలైంది.

శుక్రవారం $282000, శనివారం $305000, ఆదివారం కేవలం $120000 మాత్రమే వసూలు చేసింది. ఇప్పటి వరకు కేవలం $707000 మాత్రమే వసూలు చేసింది. ఫస్ట్ వీకెండ్ 1 మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని ఆశించారు. కానీ అలా జరగలేదు. సంక్రాంతికి ‘ఐ' సినిమా వస్తుండటంతో చాలా థియేటర్ల ‘గోపాల గోపాల' తీసేసి ‘ఐ' వేస్తున్నట్లు వినికిడి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం 1 మిలియన్ మార్కు అందుకోవడం కష్టమే అంటున్నారు.


నైజాం: 2.82 కోట్లు
 సీడెడ్ : 1.62 కోట్లు
ఉత్తరాంధ్ర: 87 లక్షలు
తూర్పు గోదావరి: 1.21 కోట్లు
పశ్చిమ గోదావరి: 76 లక్షలు
కృష్ణా : 61.3 లక్షలు
గుంటూరు: 1 కోట్లు
నెల్లూరు : 30.14 లక్షలు
మొత్తం ఎపి+నైజాం : 9.19 Crore
గమనిక: ఇవన్నీ ట్రేడ్ లో చెప్పబడుతున్న లెక్కలు మాత్రమే


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved