A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » జ్యోతికను హెచ్చరించిన సూర్య!

జ్యోతికను హెచ్చరించిన సూర్య!

{[['']]}దంపతులు సూర్య, జ్యోతికలకు సినిమా కొత్తేమీ కాదు. వీరిద్దరూ కలిసి పలు చిత్రాల్లో నటించారు. అయితే సూర్యను వివాహం చేసుకున్న తరువాత జ్యోతిక నటనకు దూరంగా ఉన్నారు. పలు అవకాశాలు  వచ్చినా తిరస్కరించారు. అలాంటిది ఇద్దరు పిల్లల తల్లి అయిన జ్యోతిక మంచి కథా చిత్రం అయితే మళ్లీ నటించాలనే నిర్ణయానికి వచ్చారు. తన ఆలోచనను భర్త సూర్య చెవిలో వేశారు. ఆయన స్పందిస్తూ నువ్వు నటించే చిత్రాన్ని ఎవరో ఎందుకు తానే నిర్మిస్తానని ముందుకొచ్చారు. అప్పటికే మలయాళంలో ఘన విజయం సాధించిన హౌఓల్డ్‌ఆర్ యు చిత్రం ఈ దంపతులకు బాగా నచ్చేసింది.

 ఇంకేముంది హౌఓల్డ్‌ఆర్‌యు చిత్రాన్ని తమ 2డీ పిక్చర్స్ పతాకంపై తమిళంలో రీమేక్ చేయడం మొదలెట్టారు. ఇందులో జ్యోతిక ప్రధాన పాత్ర పోషిస్తుండగా ఆమె సరసన రఘు నటిస్తున్నారు. చిత్రం షూటింగ్ కొంత భాగాన్ని ఢిల్లీలో చిత్రీకరించారు. ప్రస్తుతం చెన్నైలో నిర్వహిస్తున్నారు.

సాధారణంగా జ్యోతికకు షెడ్యూల్ షెడ్యూల్ మధ్య గ్యాప్ తీసుకునే అలవాటు ఉంది. గతంలో ఆమె సినిమాల్లో నటించేప్పుడు అలానే చేసేంది. అయితే ఇపుడు మాత్రం జ్యోతిక పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది. అసలు గ్యాపే తీసుకోవడం లేదు. క్షణం తీరిక లేకుండా పని చేస్తోంది. తమ సొంత బేనర్లో సినిమా కావడంతో సినిమా బడ్జెట్ పెరిగితే...నష్టపోయేది తామే కాబట్టి జ్యోతిక చాలా కష్టపడి పని చేస్తోందని అంటున్నారు. దీన్ని బట్టి జ్యోతికు భర్త అంటే బయం, భక్తి రెండు ఉన్నాయని స్పష్టమవుతోంది.Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved