A l l L i v e T e l u g u C h a n n e l s
Home » , » ‘ఐ’ డైరెక్టర్ శంకర్‌కు ఇళయరాజా లీగల్ నోటీసులు

‘ఐ’ డైరెక్టర్ శంకర్‌కు ఇళయరాజా లీగల్ నోటీసులు

{[['']]}


ప్రముఖ దర్శకుడు, త్వరలో ‘ఐ' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న దర్శకుడు శంకర్‌కు ప్రముఖ సంగీత దర్శకుడు, మేస్ట్రో ఇళయరాజా లీగల్ నోటీసులు పంపారు. ఇళయరాజా సంగీతం సమకూర్చిన పాటను ఆయన అనుమతి లేకుండా ‘కప్పాల్' అనే సినిమాలో వాడినందుకుగాను ఈ లీగల్ నోటీసులు పంపారు.

‘కప్పాల్' చిత్రాన్ని శంకర్‌కు చెందిన ప్రొడక్షన్ హౌస్ నిర్మించింది. ఈచిత్రంలో ఇళయరాజా సంగీతం సమకూర్చిన ‘కరగట్టకరన్'(1989) అనే చిత్రంలోని ‘ఓరు విట్టు ఓరు వంతు' అనే సాంగును......‘కప్పాల్' చిత్రంలో వాడారు. తన అనుమతి లేకుండా తను కంపోజ్ చేసిన పాటను వాడుకోవడంపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు.


ఈ మేరకు శంకర్‌కు చెందిన ‘ఎస్ పిక్చర్స్' సంస్థకు లీగల్ నోటీసులు పంపారు. తన అనుమతి లేకుండా తన పాట వాడుకున్నందుకు తనగిన పరిహారం చెల్లించాలని, లేకుంటే సినిమా నుండి ఆ పాటను తొలగించాలని ఇళయరాజా తన లీగల్ నోటీసుల ద్వారా డిమాండ్ చేస్తున్నారు.

అయితే ‘కప్పాల్' సినిమా టీం వాదన మరోలా ఉంది. తాము ఆ పాటలను వాడుకునేందుకు అనుమతి తీసుకున్నామని, ‘కరగట్టకరన్' సినిమా ఆడియో రైట్స్ కలిగి ఉన్న కంపెనీ నుండి అనుమతి తీసుకున్నామని అంటున్నారు. చట్ట ప్రకారం అనుమతి తీసుకుని ఆ పాటను వాడుకున్నామని అంటున్నారు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved