A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » అఫీషియల్ : బ్రేక్ అప్ ని సమంత కన్ఫర్మ్ చేసింది

అఫీషియల్ : బ్రేక్ అప్ ని సమంత కన్ఫర్మ్ చేసింది

{[['']]}


ప్రేమ పక్షలు....సమంత,సిద్దార్దల మధ్య బ్రేక్ అప్ అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఇంగ్లీష్ మ్యాగజైన్ లో వచ్చిన వార్తపై సమంత స్పందించింది. ఆమె ట్వీట్ చేస్తూ... "ఈ ఆర్టికల్ నన్ను ఓ విక్టమ్ గా చూపించింది. నేను మాత్రం కాదు. సిద్దార్ద గొప్పవాడు. మీడియా దయచేసి ఇలాంటివి చేయద్దు.. ఇది నా పర్శనల్. ఈ విషయమై ఎలాంటి కామెంట్స్, వివరణలు నా రిలేషన్ షిప్ పై వద్దు. ధాంక్యూ ." అంటూ స్పందించింది. అయితే ఈ క్రమంలో ఆమె బ్రేక్ అప్ ని ఖరారు చేసినట్లైంది.

ఆ దినపత్రిక ఈ బ్రేక్ అప్ ని ప్రస్దావిస్తూ... "ఇది సమంతకు చాలా బాధాకరమైన అనుభవం...దీన్నించి కోలుకోవటానికి సమయం పడుతుంది..ఆమె కెరీర్ మీద ఫోకస్ చేస్తుంది ". అంటూ రాసుకొచ్చింది. దానిపై తన బ్రేక్ అప్ ని అఫీషియల్ గా ఖరారు చేస్తున్నట్లు గా స్పందిస్తూ ఇలా రాసుకొచ్చింది సమంత.

వీరిద్దరు తాము క్లోజ్ ఫ్రెండ్స్ మంటూ, తమ మధ్య వేరే ఎటువంటి సంబంధం లేదని  చెప్పుకొచ్చారు. మరో వైపు సమంత తన కెరీర్ కోసమే ఈ బ్రేక్ అప్ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంటున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే సిద్దార్థ్ డేటింగ్ చేసి విరమించుకున్న శృతి హాసన్‌తోను, గతంలో పెళ్లై విడాకులు తీసుకున్నతన మాజీ భార్య సోహ అలీ ఖాన్‌లతో, సన్నిహితంగా ఉండడంతోనే సమంత బ్రేకప్ చేసినట్టు వార్తలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలా ఉంటే సిద్దార్థ్ హిందూ కాగా, సమంత కేరళ క్రిష్టియన్ మతపరంగా ఏర్పడిన పొరపొచ్చాలే వీరి బ్రేకప్‌కు కారణమంటూ మరో వర్గం నుంచి వచ్చే సమాచారం. ఏదేమైన ఈ ప్రేమపక్షలు బ్రేకప్ సినీ పరిశ్రమలో సంచలనం రేపుతోంది.Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved