A l l L i v e T e l u g u C h a n n e l s
Home » , » వాడుకున్నారు: చీటింగ్ కేసు వేస్తానంటున్న హీరోయిన్ కాజల్

వాడుకున్నారు: చీటింగ్ కేసు వేస్తానంటున్న హీరోయిన్ కాజల్

{[['']]}సినిమా హీరోయిన్లంతా కేవలం సినిమాల ద్వారానే కాకుండా.....వాణిజ్య ప్రకటనలు, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ , ఎండార్స్ మెంట్ల ద్వారా సైడ్ ఇన్ కం సంపాదిస్తున్న సంగతి తెలిసిందే. కొంత మంది హీరోయిన్లయితే సినిమాల కంటే ఇలాంటి సైడ్ యాక్టివిటీస్ ద్వారానే ఎక్కువ సంపాదిస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ విషయంలో కాజల్‌కు, నిర్వాహకులకు చిన్నపాటి వివాదం నెలకొందట. తన సదరు షాపింగ్ మాల్ నిర్వాహకులు మోసం చేసారని ఆరోపిస్తోంది కాజల్.షాపు ఓపెనింగు కోసం నన్ను సంప్రదించలేదు. కానీ సీటీ మొత్తం నేను షాపు ఓపెనింగుకు వస్తున్నట్లు హోర్డింగులు పెట్టుకున్నారు. పబ్లిసిటీ కోసం నా ఫోటోలు అనుమతి లేకుండా వాడుకున్నారు అని కాజల్ అంటున్నట్లు సమాచారం. తన ఫోటోలు వాడుకుని భారీగా పబ్లిసిటీ సంపాదించుకున్న తర్వాత....చివరి నమిషంలో నేను రావడం కుదరలేదు అంటూ తక్కువ రెమ్యూనరేషన్ కే వచ్చే చిన్న స్థాయి హీరోయిన్లు తీసుకొచ్చి షాపు ఓపెనింగ్ చేయించారని మండి పడుతోంది కాజల్.

తన పేరు, ఫోటోలను వాడుకున్నందుకు వారిపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తానని అంటోందట కాజల్. అయితే షాపింగ్ మాల్ నిర్వాహకుల వాదన మరోలా ఉన్నట్లు తెలుస్తోంది. తాము కాజల్ ను మోసం చేసినట్లు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదంటన్నారట. తొలుత కొంత మొత్తానికి వస్తానని ఒప్పుకుంది. కానీ తర్వాత హ్యాండిచ్చింది. మేము ఎక్కువ ఇచ్చుకోలేమని చెప్పాం. ఇందులో మోసం చేయడానికి ఏమీ లేదు. ఆమెను కలిసినట్లు మా వద్ద ఆధారాలు కూడా ఉన్నాయి అంటున్నారు షాపు నిర్వాహకులు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved