A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » దేవుడ్ని ప్రశ్నిస్తున్న మహేష్ బాబు (ఫొటో)

దేవుడ్ని ప్రశ్నిస్తున్న మహేష్ బాబు (ఫొటో)

{[['']]}


మహేష్,శృతిహాసన్ కాంబినేషన్ లో కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతోంది. ఈ చిత్రం షూటింగ్ లో భాగంగా మహేష్ బాబు..దేవుడ్ని ప్రశ్నిస్తున్న సన్నివేశం చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

లొకేషన్ లోని ఈ ఫొటో బయిటకు వచ్చింది. మీరూ ఓ లుక్కేయండి ఇక అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ఫిబ్రవరి 17 న మహా శివరాత్రి పూట విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే మే 1 న సినిమాని విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి శ్రీమంతుడు అనే టైటిల్ ప్రచారంలో ఉంది. నిర్మాత,దర్శకుడు ఇప్పటివరకూ ఏ టైటిలూ ప్రకటించలేదు. ఈ టైటిల్ ని రిజిస్టర్ మాత్రం చేసారు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఇప్పటి వరకు టైటిల్ అయితే ఖరారు కాలేదు. ఆ మధ్య పలు టైటిల్స్ వినిపించినా...అవేవీ కాదని కొట్టిపారేసారు దర్శకుడు శివ.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved