A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » స్పెషల సెట్ లో మహేష్ బాబు...స్టైలిష్ గా

స్పెషల సెట్ లో మహేష్ బాబు...స్టైలిష్ గా

{[['']]}'మిర్చి'తో మాస్‌ ప్రేక్షకులే కాక, క్లాస్‌ అభిమానుల నాడిని పట్టిన దర్శకుడు కొరటాల శివ. ఈ రెండు రకాల అభిమానులను కలిగి ఉన్న హీరోమహేష్‌బాబు. వీరిద్దరి కలయికలో ఓ సినిమా తెరకెక్కుతోంది. శ్రుతి హాసన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. మై త్రీ మూవీస్‌ పతాకంపై వై.నవీన్‌, వై.రవిశంకర్‌, మోహన్‌ సీఎంఆర్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

త్వరలో ఫిల్మ్‌సిటీలో ప్రత్యేకంగా రూపొందించిన సెట్‌లో మహేష్‌బాబుపై పరిచయ గీతాన్ని తెరకెక్కించనున్నారు. రాజుసుందరం మాస్టర్‌ పాటకు నృత్య రీతులు సమకూరుస్తారు. సాంగ్ చాలా స్టైలిష్ గా ఉండనుంది. మహేష్ కెరీర్ లో ప్రత్యేకంగా ఈ పాట నిలిచిపోయేలా డిజైన్ చేసినట్లు సమాచారం.

హీరోయిన్ పూర్ణ ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేస్తోంది. క్లాసికల్ డాన్సర్ కోసం వెతికి చివరకు పూర్ణతో ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. అలాగే ... ఈ పాట గ్రామీణ నేపధ్యంలో వస్తుందని చెప్తున్నారు. పూర్ణ..కథక్ డాన్సర్ కావటంతో ఆమె ఫెరఫెక్ట్ గా ఆ పాటకు సూట్ అవుతుందని ఎంపిక చేసారని తెలుస్తోంది. ఈ పాట కోసం హైదరాబాద్ లో స్పెషల్ సెట్ వేయిస్తున్నారు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved