A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » లయన్ సినిమా షూటింగ్ మేనేజర్ కిడ్నాప్.. ఎందుకు? ఎక్కడ?

లయన్ సినిమా షూటింగ్ మేనేజర్ కిడ్నాప్.. ఎందుకు? ఎక్కడ?

{[['']]}రామోజీ ఫిలిం సిటీలో ఓ సినిమా సీన్ నిజ జీవితంలో ఎదురయ్యింది. సాధారణంగా కిడ్నాప్ సీన్లు సినిమాల్లో  సర్వసాధారణం. అయితే సీన్.. తీసే వారికే షూటింగ్ సమయంలోనే జరిగితే.. జరిగితే ఏంటి? సోమవారం అదే జరిగింది. లయన్ సినిమా షూటింగు మేనేజర్ ను కిడ్నాప్ చేశారు. పోలీసులు విడిపించడంతో బతుకు జీవుడా అంటూ ఆ మేనేజర్ బయటపడ్డాడు. ఇంతకీ ఎక్కడ? ఎప్పుడు? ఎలా? అనేదేగా మీ ప్రశ్న. రండి వివరాల్లో వెళదాం.

సత్యదేవ డైరెక్షన్‌లో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న లయన్ మూవీ యూనిట్ సభ్యులు రామోజీ ఫిలింసిటీలో సినిమా షూటింగ్ లో బిజిగా ఉన్నారు. అయితే ఓ ట్రావెల్స్ ఏజెన్సీ స్టాఫ్ ప్రొడక్షన్ మేనేజర్ దిలీప్ సింగ్, క్యాషియర్ రాఘవ చంద్రలని బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్ళేందుకు సిద్ధమయ్యారు. వారితో జరిగిన పెనుగులాటలో క్యాషియర్ రాఘవచంద్ర తప్పించుకున్నాడు.

వెంటనే తేరుకున్న యూనిట్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సిటీలో చెకింగులు పెంచారు. కిడ్నాపర్లు వనస్థలిపురం వద్ద పోలీసులు పట్టేశారు. మేనేజర్ ని రక్షించారు. ఇంతా ఎందుకు జరిగిందంటే... లయన్ సినిమీ షూటింగ్ కోసం ఫనా ట్రావెల్స్ నుంచి యూనిట్ కొన్ని కార్లు అద్దెకి తీసుకున్నారు. అయితే కొంత బకాయి ఉంది. పైగా అందులో మరమ్మత్తు ఖర్చు కూడా భరించాలని ఫనా ట్రావెల్స్ కోరింది. కాని లయన్ యూనిట్ అందుకు ఒప్పుకోలేదు. 


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved