A l l L i v e T e l u g u C h a n n e l s
Home » , » నయనతార సన్యాసం?

నయనతార సన్యాసం?

{[['']]}


సౌతిండియా స్టార్ హీరోయిన్ నయనతార గురించి ఓ షాకింగ్ న్యూస్ మీడియాలో ప్రచారంలో జరుగుతోంది. ఇప్పటికే రెండు మూడు సార్లు ప్రేమలో విఫలమై డక్కామొక్కలు తిన్న ఆమె ఈ సారి కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జీవితంలో ఇంకా ముఖ్యమైన సుఖాలు అనుభవించకుండానే వాటికి దూరం కావాలని నిర్ణయించుకుందట. ఆమె నిర్ణయం మరేదో కాదు.... జీవితాంతం పెళ్లి చేసుకోకుండానే ఉండిపోవాలని నిర్ణయించుకుందట. ఆయన నిర్ణయాన్ని బట్టి ఇక నయన జీవితంలో సంసార సుఖం అనుభవించే యోగ్యం లేదని స్పష్టమవుతోంది

గతంలో శింబుతో పీకల్లోతు ప్రేమాయణంలో మునిగి నయనతార.....తర్వాత అతనికి దూరమైంది. తర్వాత ప్రభుదేవాతో వ్యవహారం ఆమె జీవితంలో ఓ సంచలనం. ఇద్దరూ పెళ్లి చేసుకునే వరకు వెళ్లారు. నయన కోసం తన భార్యకు విడాకులు కూడా ఇచ్చాడు ప్రభుదేవా. ప్రభుదేవా కోసం నయనతార అప్పట్లో మతం మార్చుకుని సినిమాలను సైతం విడిచిపెట్టింది. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరి మధ్య గొడవలు జరిగి విడిపోయారు. కొంత కాలం తర్వాత నయనతాక సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.

సెకండ్ ఇన్నింగ్స్‌లోను సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా కొనసాగుతున్న అరుదైన నటీమణుల్లో ఒకరీమె. రాజారాణి, ఆరంభం, ఇదు కదిర్‌వేల్ కాదల్ లాంటి చిత్రాల విజయాలు నయనతారకు సెకండ్ ఇన్నింగ్‌లో చాలా హెల్ప్ అయ్యాయి. ఈ మధ్య వచ్చిన అన్భే నీ ఎంగే చిత్రం నిరాశ పరచినా నటిగా ఆమె కెరీర్‌కు ఎలాంటి ఢోకా లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఈ సంచలన నటి సూర్యతో మాస్, ఉదయనిధి సరసన నన్భేండా, జయంరవికి జంటగా తనీ ఒరువన్ చిత్రాలతో పాటు లేడి ఓరియంటెడ్ చిత్రం మాయ చేస్తూ బిజీగా వున్నారు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved