A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » ఫ్యాన్స్ రెడీ....‘టెంపర్’ ఆడియో రిలీజ్ డేట్ ఇదే!

ఫ్యాన్స్ రెడీ....‘టెంపర్’ ఆడియో రిలీజ్ డేట్ ఇదే!

{[['']]}
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అగ్ర నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టెనర్ ‘టెంపర్'. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ టీజర్ నూతన సంవత్సర కానుకగా ఈ రోజు విడుదలైంది. ‘ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం. అదే ఒకడు మీదపడితే దండయాత్ర...ఇది దయాగాడి దండయాత్ర' అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ తో విడుదల చేసిన ఈ టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

తాజాగా ఈ చిత్రం ఆడియో రిలీజ్ డేట్ ఖరారైనట్లు తెలుస్తోంది. జనవరి 18న ‘టెంపర్' ఆడియో వేడుక జరుపాలని చూస్తున్నట్లు టాక్. ఈ రోజు ప్రత్యేకత ఏమిటంటే....ఈ రోజు సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి. ఈ విషయమై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ఫిబ్రవరి 5న సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved