A l l L i v e T e l u g u C h a n n e l s
Home » , » 2015 మాదే : ఎన్టీఆర్, నో థాంక్స్: కళ్యాణ్ రామ్(ఫోటోస్) (ట్రైలర్)

2015 మాదే : ఎన్టీఆర్, నో థాంక్స్: కళ్యాణ్ రామ్(ఫోటోస్) (ట్రైలర్)

{[['']]}


నిచయిత అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్ రామ్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం 'పటాస్'.. సాయి కార్తీక్ స్వరపరిచిన ఈ చిత్రం పాటల ఆవిష్కరణ వేడుక హైదరాబాద్లో జరిగింది. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్టీఆర్ ఆడియో సీడీని ఆవిష్కరించి రవితేజకు ఇచ్చారు.

ఈ ఇద్దరూ కలిసి బిగ్ సీడీని విడుదల చేశారు. శ్రేయాస్ మ్యూజిక్ ద్వారా ఈ చిత్రం ఆడియో మార్కెట్లోకి విడుదలైంది. ఈ చిత్రం ప్రచార చిత్రాలను దర్శకులు పూరి జగన్నాథ్, సురేందర్ రెడ్డి ఆవిష్కరించారు. నిర్మాతలు బి.వి.యస్.యన్. ప్రసాద్, 'దిల్' రాజు, కొమరం వెంకటేశ్, రచయిత వక్కంతం వంశీ, నందమూరి రామకృష్ణ తదితరులు చిత్రంలోని ఒక్కో పాటను విడుదల చేశారు.

 'దిల్' రాజు మాట్లాడుతూ ''కల్యాణ్ రామ్ గత రెండు చిత్రాలను నేనే విడుదల చేశాను. ఈ చిత్రాన్ని ఆంధ్ర ప్రదేశ్ మొత్తం నేనే విడుదల చేస్తున్నాను. ఈ నెలలోనే ఈ చిత్రం విడుదల ఉంటుంది'' అని చెప్పారు.

ఎన్టీఆర్ మాట్లాడుతూ "ఆయనకు మనవడిగా(సీయర్ ఎన్టీఆర్) మనవడిగా, ఈయనకు (కల్యాణ్ రామ్)కి తమ్ముడిగా ఈ వేడుకకు వచ్చాను. నన్ను, అన్నయ్యను ఒకే వేదికపై చూడాలన్నది మా అన్నయ్య జానకిరామ్ కల. మమ్మల్నిలా చూడ్డానికి ఆయన లేరు. 'ఏం బతికావ్ రా..' అని అందరూ గొప్పగా చెప్పుకునే స్థాయిలో కల్యాణ్ రామ్ అన్నయ్య బతుకుతారు. చాలా మంచి వ్యక్తి. అజాత శ్రతువు. అన్నయ్య ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ 2015 మీద మా నందమూరి కుటుంబం పేరు రాసి పెట్టి ఉండాలని కోరుకుంటున్నాను'' అన్నారు.కల్యాణ్ రామ్ మాట్లాడుతూ ''ఇక్కడకు విచ్చేసిన అతిథులకు ధన్యవాదాలు. ఎన్టీఆర్ నా తమ్ముడు, నా కుటుంబ సభ్యుడు కాబట్టి తనకు ధన్యవాదాలు చెప్పడంలేదు. ఈ చిత్రం గురించి ఇప్పుడు కాదు.. తర్వాత మాట్లాడతా'' అన్నారు.రవితేజ "కల్యాణ్ రామ్ బంగారంలాంటి మనిషి. తన సంస్థలో 'కిక్ 2' చిత్రంలో నటిస్తున్నాను. 'పటాస్' సక్సెస్ అయ్యి, కల్యాణ్ రామ్ కి ఆర్థిక లాభాలు తేవాలని కోరుకుంటున్నాను'' అని తెలిపారు.


దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ ''బీటెక్ పూర్తి చేసిన తర్వాత సినిమాల్లోకి వెళతానంటే ప్రోత్సహించిన మా అమ్మ, నాన్నకు, నా సోదరికి ధన్యవాదాలు. దర్శకుడు, మా బాబాయ్ అరుణ్ ప్రసాద్ గారి వల్ల సినిమా పరిశ్రమలోకి సులువుగా ఎంటర్ కాగలిగాను. 'ఆది' సినిమాలో చిన్నపిల్లాడు బాంబులు విసరడం చూసి, ఇలాంటి కమర్షియల్ చిత్రం ద్వారానే దర్శకునిగా పరిచయం కావాలనుకున్నాను. ఈ కథ పట్టుకుని రెండేళ్లు తిరిగాను. కథ వినగానే కల్యాణ్ రామ్ నమ్మి అవకాశం ఇచ్చారని తెలిపారు

'పటాస్‌' ట్రైలర్:

Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved