A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » దాడి : అభిమానిని స్వయంగా కలిసిన పవన్ (ఫోటోస్)

దాడి : అభిమానిని స్వయంగా కలిసిన పవన్ (ఫోటోస్)

{[['']]}



పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిపై ‘గోపాల గోపాల' ఆడియో వేడుకలో దాడి జరిగిన సంగతి తెలిసింది. ఆయన ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయిన తర్వాత స్వయంగా కలుస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. పవన్ చెప్పినట్లే కలిసారు. వైద్యం ఖర్చుల నిమిత్తం రూ. 50 వేల ఆర్థిక సహాయం అందించారు.

 గోపాల గోపాల' ఆడియో విడుదల కార్యక్రమం సందర్భంగా ఓ అభిమానిపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసి గొంతు కోసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించిన ఇద్దరు నిందితుల ఊహా చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. శిల్పకళా వేదిక ఆవరణలో బ్లేడ్ పట్టుకుని తిరుగుతున్న వ్యక్తి చిత్రాన్ని మీడియాకు అందించిన పోలీసులు అతని ఆచూకీ తెలిస్తే, 9493549415, 9491030063 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved