A l l L i v e T e l u g u C h a n n e l s
Home » , » పవన్ క్రేజ్: తలకెక్కిన అభిమానం, కోసుకున్న నితిన్?

పవన్ క్రేజ్: తలకెక్కిన అభిమానం, కోసుకున్న నితిన్?

{[['']]}పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ అంటే క్రేజ్ ఎలా ఉందంటే....ఆయనకు ఉన్నది అభిమానులు కాదు, భక్తులు అనేంతగా పరిస్థితి తయారైంది. ఈ నేపథ్యంలో ‘గోపాల గోపాల' చిత్రం విడుదలైన తర్వాత ఎలా ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వెండితెరపై దేవుడిగా దర్శనమిచ్చిన పవన్ కళ్యాణ్‌కి థియేటర్లోనే కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చారు అభిమానులు.

ఆయనంటే ఎంత అభిమానమో చాటు కోవడానికి ఏకంగా గుండుపై ‘గోపాల గోపాల' టైటిల్, పవన్ కళ్యాణ్ ఫోటో వచ్చేలా హెయిర్ కట్ చేయించుకున్నాడు ఓ అభిమాని. ఆ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ అభిమానుల్లో సాధారణ వ్యక్తులు మాత్రమే కాదు నితిన్ లాంటి యంగ్ హీరోలు సైతం ఉన్నారు. పవన్ కళ్యాణ్ ని డెమీ గాడ్ గా కొలిచేవారిలో యువహీరో నితిన్ ముందువరుసలో వుంటాడు.

పవన్‌ని తెరపై దేవుడి రూపంలో చూడగానే నితిన్ వేలుకు కోసుకుని ఆ రక్తంతో పవన్‌కి తిలకం దిద్దినట్టు సమాచారం. ఇంత కాలం నితిన్ పవన్ కళ్యాణ్ జపం జపిస్తున్నాడంటే....తన సినిమాలకు పబ్లిసిటీ తేవడానికే అని అంతా అనుకున్నారు. కానీ అతనిలో నిజమైన అభిమానం ఉందని ఈ సంఘటన రుజువు చేస్తోందని తోటి ఫ్యాన్స్ అంటున్నారు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved