A l l L i v e T e l u g u C h a n n e l s
Home » , » అత్తారింటికి వెలుతున్న పవన్, సర్జరీ కోసమేనా? ‘గోపాల గోపాల’ సెన్సార్ వాయిదా

అత్తారింటికి వెలుతున్న పవన్, సర్జరీ కోసమేనా? ‘గోపాల గోపాల’ సెన్సార్ వాయిదా

{[['']]}పవన్ కళ్యాణ్ గత కొంత కాలంగా వెన్ను నొప్పితో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య బెంగుళూరులో తాత్కాలికంగా ఆయుర్వేదిక్ చికిత్స తీసుకున్నా అది తాత్కాలిక చికిత్స మాత్రమే అని అంటున్నారు. వెన్ను నొప్పికి పూర్తి పరిష్కారం కోసం ఆస్ట్రేలియాలో సర్జరీ చేయించుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారట. అన్నట్లు పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజినోవా స్వస్థలం ఆస్ట్రేలియా కావడంతో ఈ విషయం హాట్ టాపిక్ అయింది. ఆయన తొలిసారిగా అత్తారింటికి వెలుతున్నారనే ప్రచారం మొదలైంది.

 పవన్ కళ్యాణ్ నటించిన గోపాల గోపాల సినిమా విషయానికొస్తే ఈ చిత్రం సంక్రాంతికి విడుదల అవుతోంది. ఈ చిత్రాన్ని జనవరి 9న విడుదల చేయాలని ప్లాన్ చేసారు. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు(జనవరి 7) సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావాల్సి ఉంది. అయితే అనుకోని కారణాలతో సెన్సార్ వాయిదా పడింది.

దీంతో సినిమా ఎట్టి పరిస్థితుత్లోనూ జనవరి 9 విడుదలయ్యే అవకాశం లేదు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి 11 లేదా, జనవరి 14న విడుదలయ్యే అవకాశం ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడినా....టీవీ, వార్తా పత్రికల ప్రకటనల్లో డేట్ ఖరారు చేయడం లేదు. త్వరలో...త్వరలో అని తప్ప డేట్ మాత్రం కనిపించడం లేదు. దీంతో అడ్వాన్స్ బుకింగ్ చేసుకుందామని ప్రయత్నిస్తున్న అభిమానులు ప్రతి రోజు థియేటర్ల చూట్టూ తిరగాల్సి వస్తోంది. డేట్ ఖరారు కాని కారణంగా అడ్వాన్స్ బుకింగ్ ఇవ్వడం లేదు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved