A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » ఆ డైలాగ్ లోని ఆంతర్యమేమిటి?.. రాజకీయ ప్రత్యర్థులకు పవన్ వార్నింగా..!?

ఆ డైలాగ్ లోని ఆంతర్యమేమిటి?.. రాజకీయ ప్రత్యర్థులకు పవన్ వార్నింగా..!?

{[['']]}


గోపాల గోపాల ద్వారా హీరో పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రత్యర్థులకు హెచ్చరిక ఇచ్చారా..? పదే పదే తనపై విమర్శలు చేసేవారికి ఓ సమాధానం ఇచ్చారా..? మరోవైపు తన రాజకీయ జీవితంపై తన అభిమానుల్లో వాడీవేడీ తగ్గకుండా చూసుకుంటున్నాడా..!? అనే సందేహాలు కలుగుతున్నాయి. సినిమా టీజర్ లోని ఓ డైలాగు ఇటు సినీ, అటు రాజకీయ రంగాలలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆయన చెప్పిన ఆ డైలాగు ఏంటి? రండీ చూద్దాం. 

2014 ఎన్నికల మందు పార్టీ పెట్టి, చివరకు ప్రత్యక్షంగా పోటీ చేయడం లేదని చెప్పి.. ఆపై భారతీయ జనతా పార్టీకి ప్రచార భాద్యతలను నెత్తికెత్తుకుని ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలలో ముమ్మరంగా ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ ఆపై కాస్త విరామం తీసుకున్నారు. దీంతో ఆయనపై నాటి నుంచే రాజకీయ విమర్శలు ఎక్కువయ్యాయి.

పార్టీ పెట్టి పోటీ చేయడం లేదని చెప్పడం ఏంటని ప్రత్యర్థులు విమర్శలు చేశారు. ఆపై హైదరాబాద్ నగరపాలక ఎన్నికలకు సిద్ధమవుతున్నారనే మాటలు వినిపించినా పవన్ మాత్రం పూర్తిగా సినిమాలపై దృష్టి సారించారు. దీంతో ఆయనపై విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. అన్నచిరంజీవిలాగే అవకాశవాద రాజకీయాల చేస్తున్నారే ఆరోపణలు ఎక్కవయ్యాయి. వీటిన్నింటికి పవన్ ఎప్పటి నుంచో సమాధానం చెప్పాలనే ఉన్నారు. ఇందుకు గోపాల గోపాల సినిమాలోని ఓ డైలాగుతో సమాధానం చెప్పినట్లు అనిపిస్తోంది. ఆడియో విడుదల సందర్బంగా విడుదలైన టీజర్  చూస్తే అదే అనిపిస్తోంది. ఆయన ఏం డైలాగు చెప్పారంటే


‘ కొన్నిసార్లు రావడం లేటవచ్చేమోకానీ.. రావడం మాత్రం పక్కా’ అంటూ పవర్ ఫల్ గానే చెప్పారు. డైలాగు చెప్పిన తీరు, వాలకం చూస్తే తన రాజకీయ ప్రస్థానం గురించే అయి ఉంటుందని కొందరు వాదిస్తున్నారు. ఇక ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నట్లే అని తన ప్రత్యర్థుల విమర్శల్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారని పవన్ ఫ్యాన్స్ వాదిస్తున్నారు. ఆయన రాక కోసం తాము ఎప్పుడెప్పుడా అని ఉన్నామని అంటున్నారు.Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved