A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » పవర్ స్టార్ ట్విట్టర్ హిట్... రేణు సూచనతోనే...?!

పవర్ స్టార్ ట్విట్టర్ హిట్... రేణు సూచనతోనే...?!

{[['']]}


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ హిట్టు కొట్టింది. ఒక్క రోజులో లక్షల ఫాలోయర్లతో క్లిక్కు పట్టి రికార్డును సొంతం చేసుకుంది. చాలా వరకు మీడియాకు దూరంగా ఉండే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు నూతన సంవత్సరం రోజున ట్విట్టర్ ఖాతా ప్రారంభించి అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే.

ఆయన ఒక్క రోజులోనే లక్షల మంది ఫాలోయర్లు ఆయన ట్విట్టర్ ఖాతాను షేర్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే అసలు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ఖాతా తెరవాలనే నిర్ణయం తీసుకోవడానికి ఆయన మాజీ భార్య, నటి, దర్శకురాలు రేణు దేశాయ్ కారణమట.

ఈ విషయాన్ని స్వయానా రేణు దేశాయ్ ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ..‘గత మూడు నెలల నుండి ఆయన్ను కన్విన్స్ చేస్తున్నాను. కమ్యూనికేషన్ విషయంలో సోషల్ మీడియా ప్రాముఖ్యత ఎంతో ఉంది. మొత్తానికి ఆయన ట్విట్టర్ విషయంలో కన్విన్స్ అయ్యారు' అంటూ వెల్లడించింది.

ఇదిలా ఉంటే పవర్ స్టావర్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ఖాతా తెరవడం రికార్డుల సృష్టిస్తోంది.  అకౌంట్ ఓపెన్ చేసిన తొలి రోజునే అత్యధిక పాలోవర్స్‌ను సొంతం చేసుకున్న ఇండియన్ సెలబ్రిటీల లిస్టులో పవన్ కళ్యాణ్ రికార్డు సృష్టించారు. ఆయన 24 గంటల్లో పవన్ కళ్యాణ్ ఖాతాను అనుసరించే వారి సంఖ్య 91వేలకు చేరుకోవడం విశేషం


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved