A l l L i v e T e l u g u C h a n n e l s
Home » , » ఆఫర్ ఇవ్వమంటే శ్వేతా బసును అలా అడుగుతున్నారట...!

ఆఫర్ ఇవ్వమంటే శ్వేతా బసును అలా అడుగుతున్నారట...!

{[['']]}వ్యభిచారం కేసులో ఇరుక్కుని కొన్నాళ్లు మహిళా సంరక్షణ శాలలో ఉండివచ్చిన శ్వేతాబసును కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. కానీ దక్షిణాది ఫిలిమ్ ఇండస్ట్రీ మాత్రం ఆమెను అలాగే చిన్నచూపు చూస్తోందట. ఛాన్సుల కోసం అడుగుతుంటే సింపథీ చూపిస్తున్నారట. కొంతమంది డైరెక్టర్లు ఛాన్సుల మాట పక్కనపెట్టి ఓదార్పు మాటలు చెపుతున్నారట.

వ్యభిచారం కేసులో ఇరుక్కున వైనంలో తన తప్పేమీ లేదని చెప్పుకోవాల్సి వస్తోందనీ, కొందరు ఆ కారణంతో తనను చాలా చిన్నచూపు చూస్తున్నారని వాపోతుందట శ్వేత. దీంతో చిర్రెత్తిపోయిన శ్వేతా బసు, 'ఆఫర్స్ ఉంటే ఇవ్వండి కానీ ఆ కారణంతో మాత్రం తనని పదేపదే అడిగి ఇబ్బంది పెట్టవద్దు' అంటూ మండిపడుతోందట.

ఇకపై ఎవరయినా తన గురించి ఈ విషయాన్ని ప్రస్తావిస్తే మాత్రం ఒప్పుకునేది లేదంటూ ఫైర్ అయ్యింది. టాలీవుడ్ కు చెందిన ఓ డైరెక్టర్ ఇటీవల అలా మాట్లాడటం తనకు చాలా బాధ కలిగించినట్లు శ్వేతా బసు అన్నట్లు సమాచారం.
Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved