A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » రూ. ఐదు కోట్లు గోవిందా...! అనుష్క ఆవేదన..!

రూ. ఐదు కోట్లు గోవిందా...! అనుష్క ఆవేదన..!

{[['']]}


టాలీవుడ్, కోలీవుడ్‌లలో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న అందాల సుందరి అనుష్క. ఈ బ్యూటీ ఐదు కోట్ల రూపాయలు పోయిందంటూ గంగ్గోలు పెడుతోంది. ఇంతకీ ఆ ఐదు కోట్ల రూపాయల వ్యవహారం ఏంటి? ఎలా వచ్చింది.. ఎలా పోయింది..? అనుకుంటున్నారా. అయితే చదవండి మీకే విషయం తెలుస్తుంది.

ప్రస్తుతం అనుష్క తెలుగులో బాహుబలి, రుద్రమదేవి వంటి  రెండు భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ అమ్మడు రజనీకాంత్ సరసన నటించిన లింగా చిత్రంపై ఎంతో ఆశలు పెట్టుకుందట. ఆ చిత్రం మోజులో పడి అప్పుడు వచ్చిన పలు ఆఫర్లను వదులుకుందట.

అనుష్క లింగా చిత్రంలో నటిస్తుండగా  విజయ్, విశాల్, కార్తీలతో నటించే ఛాన్స్‌లు వచ్చినా, లింగా షూటింగ్ డేట్స్ కారణంగా ఆ చిత్రాల్లో మళ్లీ నటిస్తానని పోస్టుపోన్ చేసుకుందట. అయితే అలా అన్నింటిని పక్కనపెట్టి లింగాపై ఆశలు పెట్టుకుందట. లింగా బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టడంతో అనుష్క తీవ్ర నిరాశకు లోనైంది.

కాగా లింగా చిత్రం నటించే రోజుల్లో వచ్చిన ఆఫర్లలో నటించాలని అనుకుంటే, లింగా లిజ్ట్‌తో తనకు వచ్చిన ఆఫర్లు అన్ని వేరేవాళ్లకు వెళ్లిపోయాట. తద్వారా తనకు ఐదు కోట్ల రూపాయలకు పైగా ఆదాయం పోయిందని అనుష్క ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయితే ప్రస్తుతం నటిస్తున్న తెలుగులో రెండు చిత్రాలపైన, తమిళంలో ఒక చిత్రంపైన అనుష్క ఆశలు పెట్టుకుంది.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved