A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » మధ్యాహ్నం వీబీ రాజేంద్రప్రసాద్ అంత్యక్రియలు

మధ్యాహ్నం వీబీ రాజేంద్రప్రసాద్ అంత్యక్రియలు

{[['']]}జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత, ప్రముఖ దర్శకుడు, నిర్మాత  వీబీ రాజేంద్రప్రసాద్ అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రగడ్డ శ్మశానవాటికలో జరగనున్నాయి. ఆయన భౌతికకాయానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి, దర్శకుడు రాఘవేంద్రరావు, ఎంపీ, నటుడు మురళీ మోహన్ తదితరులు ఈరోజు ఉదయం రాజేంద్రప్రసాద్ భౌతికకాయాన్ని సందర్శించి అంజలి ఘటించారు.

అనంతరం మురళీమోహన్ మాట్లాడుతూ సందర్శనార్థం మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకూ ఫిలిం చాంబర్ లో రాజేంద్రప్రసాద్ పార్థివదేహాన్ని ఉంచుతారు. అక్కడ నుంచి అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. కాగా కొన్నేళ్లుగా గొంతు కేన్సర్‌తో బాధపడుతున్న రాజేంద్రప్రసాద్ సోమాజిగూడలోని ఇషా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved