A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » త్రిష నిశ్చితార్థం డేట్ ఫిక్స్... ఎవరితో.. ఎక్కడ?

త్రిష నిశ్చితార్థం డేట్ ఫిక్స్... ఎవరితో.. ఎక్కడ?

{[['']]}



అందాల బ్యూటీ త్రిష నిశ్చితార్థం ఖరారైంది. ఈనెల 23వ తేదీన ఇది జరుగనుంది. తమిళ చిత్ర రంగానికి చెందిన యువ నిర్మాత వరుణ్ మణిని ఆమె వివాహం చేసుకోబోతున్నారు. వీరిద్దరి నిశ్చితార్థం ఈనెల 23వ తేదీన జరుగనున్నట్టు త్రిషనే స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. వివాహం మాత్రం మార్చి నెలలో ఉంటుందని పేర్కొంది.

అయితే, తన పెళ్లి తేదీ గురించి ఎలాంటి ప్రచారం చేయవద్దని, ఇంకా తాము ఖరారు చేయలేదని చెప్పింది. వివాహం ఎప్పుడనేది తానే స్వయంగా చెబుతానని త్రిష అభిమానులనుద్దేశించి పేర్కొంది. అలాగే, నిశ్చితార్థం కూడా ఓ ప్రైవేట్ కార్యక్రమంగా నిర్వహిస్తున్నట్టు తెలిపింది.

అదేసమయంలో వివాహం చేసుకున్న తర్వాత కూడా సినిమాల నుంచి వెళ్లిపోయే ప్రసక్తే లేదని, త్వరలో రెండు సినిమాలను ఒప్పుకోనున్నానని వివరించింది. ఈ యేడాది నాలుగు చిత్రాలు విడుదల కానున్నాయని తెలిపింది. కొంతకాలం నుంచి వరుణ్ మణియన్‌కు, తనకు మధ్య సంబంధం ఉన్నట్టు వార్తలు వస్తున్నప్పటికీ వాస్తవం కాదని ఖండిస్తూ వచ్చిన త్రిష ఇపుడు పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించడం గమనార్హం.

Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved