A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » ఫస్ట్ డే రికార్డ్: పవన్ కళ్యాణ్ సెకండ్ ప్లేస్

ఫస్ట్ డే రికార్డ్: పవన్ కళ్యాణ్ సెకండ్ ప్లేస్

{[['']]}పవర్ స్టావర్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ఖాతా తెరవడం ఏమో కానీ.....రికార్డుల మోత మోగుతోంది. అకౌంట్ ఓపెన్ చేసిన ఫస్ట్‌డే అత్యధిక పాలోవర్స్ ను సొంతం చేసుకున్న ఇండియన్ సెలబ్రిటీల లిస్టులో పవన్ కళ్యాణ్ అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్లను బీట్ చేసిన పవన్ సెకండ్ ప్లేస్ సొంతం చేసుకున్నారు.

ఆయన అకౌంట్ ఓపెన్ చేసిన 22 నిమిషాల్లోనే ఆయన్ను ఫాలో అయ్యే వారి సంఖ్య 4000 దాటింది. 12 గంటలు పూర్తయ్యేలోగా ఆ సంఖ్య కాస్తా 55 వేలు దాటింది. శుక్రవారం మధ్యాహ్నం 1 గంటలకు (అకౌంట్ ఓపెన్ చేసి 18 గంటలైంది) 70 వేలకుపైగా పాలోవర్స్ అయ్యారు.

https://twitter.com/PawanKalyan

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయగా ఒక రోజు(24 గంటల్లో) 46 వేల పైచిలుకు ఫాలోవర్స్ అయ్యారు. అమితాబ్ బచ్చన్ 37,500 పై చిలుకు పాలోవర్స్ అయ్యారు. అయితే ఇప్పటి వరకు ఈ ఇద్దరు సెలబ్రిటీల 2, 3 స్థానాల్లో ఉన్నారు. తొలిస్థానంలో సౌతిండియా స్టార్ రజనీకాంత్ ఉన్నారు.


ఆయన ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసిన ఒక రోజులో 2,15,000 ఫాలోవర్స్ అయ్యారు. తాజాగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ 2వ స్థానం దక్కించుకున్నాడు. మరి ఒక రోజు పూర్తయ్యేలోగా పవన్ ఎంత మంది ఫాలోవర్స్ ను సొంతం చేసకుంటారనేది ఆసక్తికరంగా మారింది.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved