A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » చిరు, పవన్‌ సినిమాలు ఒకే రోజు విడుదలైతే...?

చిరు, పవన్‌ సినిమాలు ఒకే రోజు విడుదలైతే...?

{[['']]}

అవును... ఇటువంటి ఆలోచనలు ఫ్యాన్స్‌కు వచ్చిందో లేదో కానీ.. వింత ఆలోచనలు వున్నవారికి వస్తాయి. అలాంటి కోవలోకి దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ వస్తాడు. ఇటీవల ఏదోవిధంగా మీడియాలో నానుతూ వుండే ఆయన గోపాల గోపాల సినిమా తర్వాత ట్విట్టర్‌లో ట్వీట్‌ పోస్ట్‌ చేశాడు.

చిరంజీవి 150వ సినిమాకు కథ దొరక్క ఎదురుచూస్తున్నారు. ఒకవేళ దొరికి సినిమాగా వచ్చాక.. మరోవైపు పవన్‌ కళ్యాన్‌ సినిమా కూడా అదే రోజు విడుదలైతే ఎలా వుంటుందో చూడాలని కుతూహలంగా వుందంటున్నాడు.

రామూజీ చెప్పినదాంట్లోనూ పాయింట్ ఉంది. అన్న అండతోనే తమ్ముడు ఈ రంగంలో ఎదిగినా...ప్రస్తుతం అన్నయ్యను మించి పోయాడు. మరి ఇద్దరి సినిమా ఒకే రోజు విడుదలైతే....బాక్సాఫీసు వద్ద పోటీ రసవత్తరంగా ఉంటుంది. చిరంజీవి 150వ సినిమా విషయానికొస్తే...2015లో తప్పుండా వస్తుందని అంటున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓఆసక్తికర అంశం పిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలో ఈ విషయం తేలనుందట.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved