A l l L i v e T e l u g u C h a n n e l s
Home » , » ఎందుకు మాట్లాడాలి? గొప్పగా ఏమీలేదు: రజనీకాంత్

ఎందుకు మాట్లాడాలి? గొప్పగా ఏమీలేదు: రజనీకాంత్

{[['']]}




రజనీకాంత్ సినిమాల్లో తప్ప మీడియాలో కనిపించేది చాలా తక్కువ. ఆయన గురించి వార్తలే తప్ప....ఆయన స్వయంగా మీడియాతో మాట్లాడటం చాలా అరుదు. ఆడియో ఫంక్షన్లు, ఇతరత్రా కార్యక్రమాల్లో మాత్రం సందర్భాన్ని అనుసరించి మాట్లాడతారు. ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు అసలు ఆయన ఎందుకు మీడియాతో అంతగా ఇంటరాక్ట్ అవ్వరు? అనే విషయానికి రజనీకాంత్ స్వయంగా సమాధానం ఇచ్చారు.

ఈ విషయం గురించి రజనీకాంత్ మాట్లాడుతూ...‘మీడియాతో మాట్లాడటానికి నేనేమీ గొప్ప పనులు చేయలేదు. అలాంటపుడు మీడియాతో మాట్లాడటానికి ఏముంటుంది. నా గురించి నేను మీడియాతో మాట్లాడటం నాకు నచ్చదు' అంటూ సింపుల్ గా సమాధానం ఇచ్చారు తలైవర్.

‘కేవలం గొప్ప పనులు చేసిన వారు మాత్రమే ఆ విషయాలు చెప్పడానికి మీడియాను ఆశ్రయిస్తారు. నేను ఆ కేటగిరీకి చెందిన వాడిని కాదని నా భావన. నేనేమిటో నేను చేసే పనులే చెబుతాయి' అంటూ సమాధానం ఇచ్చారు. మొత్తానికి ఆయన మాటలను బట్టి మీడియాకు దూరంగా ఉండటానికే రజనీకాంత్ ఇష్ట పడతారని తెలుస్తోంది.



Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved