A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » వెళ్లే‌ లోపే చనిపోయిన బాలిక, బాధలో జూ ఎన్టీఆర్

వెళ్లే‌ లోపే చనిపోయిన బాలిక, బాధలో జూ ఎన్టీఆర్

{[['']]}

మహీబా....అనే బాలిక గత 18 నెలలుగా క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతోంది. మరణానికి చేరువైన ఆమె తన అభిమాన హీరో జూ ఎన్టీఆర్‌ను చూడాలని ఆశ పడింది. అయితే ఆమె కోరిక తీరకుండానే మహీబా కన్ను మూసింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ జూ ఎన్టీఆర్ ట్వీట్ చేసారు.

‘మహీబా అనే బాలిక క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతూ నన్ను కలవాలని ఆశ పడింది. నాకు ఆ విషయం తెలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ అంతలోనే మరో చేదు వార్త విన్నాను. ఆమె మరణించింది. ఆమె కోరిక తీర్చలేక పోయినందుకు చాలా బాధగా ఉంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఆమె కుటుంబానికి దేవుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను అన్నారు.

నిరు పేద కుటుంబంలో జన్మించిన మహీబా ప్రాణాంతకమైన బ్లడ్ క్యాన్సర్‌తో బాధ పడుతోంది. కొంత కాలంగా హైదరాబాదులోని బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రిలో వైద్యం పొందుతోంది. తన బిడ్డ సినీ నటుడు జూ ఎన్టీఆర్‌ని చూడాలనేది చివరి కోరికని మహిబ తల్లి వెల్లడించారు. నిరుపేద అయిన మహీబా తండ్రి రిక్షా కార్మికుడు కాగా, తల్లి కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తోంది.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved