A l l L i v e T e l u g u C h a n n e l s
Home » , » మూడో పెళ్లి చేసుకున్న సంగీత దర్శకుడు

మూడో పెళ్లి చేసుకున్న సంగీత దర్శకుడు

{[['']]}


 ప్రముఖ సంగీత విద్వాంసుడు ఇళయరాజా చిన్న కుమారుడు యువన్ శంకర్ రాజా మూడో వివాహం చేసుకున్నారు. తమిళనాడు రామనాథపురం జిల్లాలోని కిజాకరాయ్ ప్రాంతానికి చెందిన ముస్లిమ్ యువతి జఫరున్నీసాను గురువారం ఆయన పెళ్లి చేసుకున్నారు.

కిజాకరాయ్ సమీపంలోని శంకళ్ నీరొదైలో ఓ గార్డెన్ లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య వీరి వివాహం జరిగినట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. పెళ్లి కూతురు బంధువులు మాత్రమే ఈ పెళ్లికి హాజరైనట్టు తెలిపాయి. 35 ఏళ్ల యువన్ గతంలో సుజయ చంద్రన్‌,  శిల్పా మోహన్‌ లను పెళ్లాడారు. తర్వాత వారికి విడాకులిచ్చారు. దాదాపు 20 ఏళ్ల కెరీర్‌లో వంద చిత్రాలకు యువన్ సంగీత దర్శకునిగా వ్యవహరించారు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved